వెబ్ సీరిస్ లో రానా… - MicTv.in - Telugu News
mictv telugu

వెబ్ సీరిస్ లో రానా…

August 19, 2017

రానా ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ‘నేను హీరోగానే చేస్తా..’ అని పట్టుపట్టకుండా కాకుండా విభిన్న పాత్రలు చేస్తూ ఆలరిస్తున్నాడు. విలన్ గా, హీరోగా , క్యారెక్టర్ నటుడిగా..  ఏ పాత్ర చేసినా కూడా తనదైన నటనతో అభిమానులను అలరించారు. ఇప్పుడు ఆయన మరో ప్రయోగం చేయనున్నారు. వెబ్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తాను హోస్ట్ గా చేస్తున్న ‘’నంబర్ వన్ యారి విత్ రానా’  ప్రోగ్రామ్ నిర్మాతల కోసం ఈ కొత్త సిరీస్ చేస్తున్నాడట.

నంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న’ వియూ సంస్థ ‘ఇప్పటికే పలు వెబ్ సీరిస్ లతో ఆకట్టకుంది. ఇప్పుడు  తాజాగా రానా, నవీన్ కస్తూరియాలతో ‘ఓ సోషల్’ పేరుతో మరో వెబ్ సీరిస్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సీరిస్ ను  సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కొటోంది అన్న నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు.