100 మంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్లో పెట్టేస్తే నేనే సిఎం ? - MicTv.in - Telugu News
mictv telugu

100 మంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్లో పెట్టేస్తే నేనే సిఎం ?

June 23, 2017

‘‘ వంద ఎమ్మెల్యేలను తీస్కెళ్ళి స్టార్ హోటల్లో పెడితే సాయంకాలానికి నేనూ అవుతా సీఎం ’’ అని రాణా ‘ నేనే రాజు నేనే మంత్రి ’ సినిమా ట్రైలర్ లో చెప్పిన ఈ డైలాగ్ రాజకీయ చర్చకు దారి తీస్తోంది. అంటే రాజకీయ వ్యవస్థను పట్టుకొని ఫుట్ బాల్ ఆడేస్తున్నారా అనేది ఇప్పడు సర్వత్రా వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ? ఈ వంద మంది ఎమ్మెల్యేలు, స్టార్ హోటల్ అనగానే బుద్ధున్న ఏ తెలుగోడికైనా ఠక్కున రైజయ్యే డైనమిక్ లీడర్ పేరు నారా చంద్రబాబు నాయుడు అండ్ సికింద్రాబాదు వైస్రాయ్ హోటలే !

అంటే ఈ సనిమా అప్పటి రాజకీయ సంక్షోభాన్ని కళ్ళకు కడుతుందా అనేది సన్పెన్స్ క్వశ్చన్ ? మొత్తానికి దర్శకుడు తేజా తన రూటును పాలిటిక్స్ వైపు టర్న్ చేసుకున్నాడు. లవ్ స్టోరీలు తీసినవే తీసి జనాలను ఇంకెంత కాలం విసుగెత్తించాలని కాబోలు తేజ రూటు మార్చాడు. జయం, నువ్వు నేను సినిమాల ప్యాటన్ లనే అటు తిప్పి ఇటు తిప్పి తీసి తీసి బోర్ ఫీలైనట్టున్నాడు అందుకే రాజకీయాస్త్రం ప్రయోగిస్తున్నాడు. ఇలా లీడర్ల మీద సినిమా తీస్తేనైనా నిలదొక్కుకుంటానని అనుకున్నాడేమో రాణాను ఎంచుకొని ‘ నేనే రాజు నేనే మంత్రి ’ సినిమా తీసేసాడు. చూడాలి మరి నేనే రాజు నేనే మంత్రిలో ఎవరు రాజు ? ఎవరు మంత్రి ? అనేది సినిమా రిలీజైన తర్వాత బోలెడు మాట్లాడుకోవచ్చు !