ranaveer singh kisses aishwarya roy
mictv telugu

భర్త కూతురి ముందే కిస్.. ఐశ్వర్య రణవీర్ ల పబ్లిక్ రొమాన్స్ వీడియో లీక్

December 19, 2022

ranaveer singh kisses aishwarya roy

బాలీవుడ్ లో అంతే. అందరు కాస్త అతిగానే ప్రవర్తిస్తారు. పాశ్చాత్య ప్రభావం వారిపై ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ వ్యవహారం ఎప్పుడు చర్చనీయాంశగానే ఉంటుంది. రణవీర్ ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉండాల్సిందే. ఎంతటి వారినైనా ఆడేసుకుంటాడు. దూకుడుగా వెళ్లే క్రమంలో కొన్నిసార్లు కాంట్రవర్సీలు కూడా కొనితెచ్చుకుంటాడు. ముఖ్యంగా ఒంటిపై బట్టలు లేకుండా రణవీర్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ పెద్ద వివాదమే అయింది. భార్య దీపికా సైతం ఆగ్రహంతో విడాకుల ఇచ్చేవరకు మ్యాటర్ వెళ్లిందని రూమర్స్ ఉన్నాయి. కానీ కరణ్ జోహార్ జోక్యం చేసుకుని రణవీర్, దీపికాల కాపురాన్ని చక్కపెట్టాడని అంటారు. అయితే పైకి అంతా నార్మల్ గానే ఉన్నా.. రణవీర్, దీపికాల మధ్య మనస్పర్థాలు ఇంకా ఉన్నాయని.. వీరిద్దరూ కలిసి ఉండటం లేదని కూడా రూమర్స్ ఉన్నాయి. రణవీర్ పై కోపంతోనే షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీలో దీపికా రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేసిందని అంటున్నారు. రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ కి కౌంటర్ గా దీపికా బికినీ వేసిందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి బీ టౌన్ సోషల్ మీడియాలో రణవీర్ పిచ్చి చేష్టలు వైరల్ అవుతున్నాయి. పెళ్ళై టీనేజ్ కూతురు ఉన్న ఐశ్వర్య రాయ్ ని పబ్లిక్ ప్లేస్ లో ముద్దు పెట్టి రణవీర్ వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ అతి కల్చర్ కి బచ్చన్ కుటుంబం కాస్త దూరంగానే ఉంటుంది. పబ్లిక్ ఈవెంట్స్ లో అమితాబ్ బచ్చన్ కుటుంబం హుందాగా ఉంటారని పేరుంది. అలాంటి బచ్చన్ కోడలిని కిస్ చేయటం ఏంటని రణవీర్ సింగ్ పై అమితాబ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వీకెండ్ సందర్భంగా ఐశ్వర్యారాయ్.. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యతో కలిసి పుణెలో ప్రో కబడ్డీ మ్యాచ్‌కు హాజరైంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు తమ సొంత టీమ్ జైపూర్ పాంథర్స్‌ను ఉత్సాహపరిచింది ఐశ్వర్య. ఇదే మ్యాచ్ కి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా హాజరయ్యాడు. పూల చొక్క వేసుకుని, టోపీ ధరించి స్టేడియంలోని స్టాండ్స్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. అయితే మ్యాచ్ జరుగుతుండగా రణవీర్ సింగ్.. సమీపంలో ఉన్న ఐశ్వర్యరాయ్ వద్దకు వెళ్లాడు. ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని ఎదో మాట్లాడుతూ ఆట పట్టించాడు. ఇంతలో ఐశ్వర్య చిరునవ్వులు చిందిస్తూ రణవీర్ సింగ్ బుగ్గపై చేతితో కొడుతోంది. ఈ క్రమంలోనే అతికి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన రణవీర్ ఛాన్స్ యూస్ చేసుకున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని రణవీర్ ముద్దు పెట్టేశాడు. దీంతో ఐశ్వర్య చిలిపిగా మళ్ళీ అతడి బుగ్గులు పట్టి లాగింది. టీనేజిలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య కూతురు ఆరాధ్య ముందే ఈ తంతు అంతా జరిగింది. అమ్మతో రణవీర్ బిహేవియర్ ని చూసి ఆరాధ్య వింత ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ నెట్టింటో హల్ చల్ చేసున్నారు. రణవీర్ లక్ బాయ్ అని కొందరు, పద్ధతి మార్చువుకోవాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.