మనసున్న హీరో ! - MicTv.in - Telugu News
mictv telugu

మనసున్న హీరో !

July 14, 2017

రణ్ భీర్ కపూర్ నిజంగా మనసున్న హీరో అనిపించుకుంటున్నాడు. తను ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ జగ్గా జాసూస్ ’ ఈ నెల 14 న రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ఈ సినిమా పక్కా హిట్టని చాలా కాన్ఫిడెన్సుగా వున్నాడు రణ్ భీర్. అయితే కొందరు ఈ సినిమా ఫ్లాప్ అనడంతో వాళ్ళ ముందుకు సవాల్ విసురుతున్నాడు. ఈ సినిమా గనక ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలిగితే అది నేను భరిస్తానని అంటున్నాడు. పైసాతో సహా డిస్ట్రిబ్యూటర్లకు లెక్కగట్టిస్తానని చెప్తున్నాడు. సినిమా ఖచ్చింతంగా హిట్టనే టాక్ నడుస్తోంది. ఇన్ కేస్ ఫ్లాప్ అయే సిట్యుయేషన్ వుంటే రణ్ భీర్ డిస్ట్రిబ్యూటర్లకు ఆసరాగా నిలబడతాననడం తారీఫ్ ల ముచ్చటనే.

రణ్ భీర్ కపూర్ నిజంగా ఇంతవరకూ ఏ హీరో చెయ్యని గొప్ప పని చేస్తున్నాడని అంటున్నారు. ఈయన్ను ఆదర్శంగా తీస్కుంటే చాలా మంది రియల్ టైం హీరోలు అనిపించుకుంటారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీస్కుంటారు ఒక్కొక్క హీరో. సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని భరించాల్సింది నిర్మాత ఒక్కడే. సినిమా బడ్జెట్లో అత్యధికంగా హీరో బడ్జెట్టే వుంటుంది. సినిమా అయిపోయాక ఆ సినిమా హిట్టు ఫ్లాపులతో ప్రమేయం లేకుండా గడ్డ మీది కొంగలా చల్లగా దాటిపోయే హరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రణ్ భీర్ కపూర్. గతంలో కూడా ఈ సదాచారాన్ని కపూర్ ఫ్యామిలీ పాటించింది. రణ్ భీర్ కూడా దాన్ని కొనసాగించడం మంచి తరుణం అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.