బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్బీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట ఏప్రిల్ 14న భార్యాభర్తలుగా జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓపెన్ అయ్యాడు రణ్బీర్. పెళ్లికి ముందు ఆ తర్వాత తన లైఫ్లో పెద్దగా మార్పులేమి చోటుచేసుకోలేదంటున్నాడు.
‘ఐదేళ్లుగా కలిసే ఉన్నాం. కొత్తగా మా జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. పెళ్లయితే చేసుకున్నాం అనే ఫీలింగ్ తప్పించి ఇద్దరికీ ఎలాంటి కొత్త అనుభూతి లేదు. మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వల్ల పెళ్లయిన తర్వాతి రోజు నుంచే మేమిద్దరం షూటింగ్కు బయలుదేరాం. దీంతో మాకు వివాహమైందని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాం’ అంటూ వివరించాడు. ఇక హాలీవుడ్లో నటించాబోతున్నారా అనే విషయంపై మాట్లాడుతూ.. ఇప్పట్లో అలాంటి ఆలోచనలేవి లేవని చెప్పాడు. ప్రస్తుతానికైతే ‘బ్రహ్మాస్త్ర’ గురించి కలలు కంటున్నానని, ఆ తర్వాత అలియా షూటింగ్ నుంచి తిరిగి రాగానే ఒక వారం ఆమెతో గడపాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు.