'ఆర్ఆర్ఆర్'కు రాంచరణ్ గోల్డెన్ గిఫ్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’కు రాంచరణ్ గోల్డెన్ గిఫ్ట్

April 4, 2022

bcbfcb

తెలుగు చిత్రసీమ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆధ్వర్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ కథనాయకులుగా నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం విడుదలైన రోజునుంచి నేటీవరకు దేశవ్యాప్తంగా కలెక్షన్ల మీద కలెక్షన్లు వసూలు చేస్తూ, బాక్సాఫీసును షేక్ చేస్తుంది. ఈ సందర్భంగా హీరో రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చారు. ముందుగా సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో కలిసి అల్పాహారం తిని, కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం సినిమా విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. సుమారు 35 మందికి రాంచరణ్ తులం బంగారం కాయిన్లను (ఆర్ఆర్ఆర్ లోగోతో ఉన్న) కానుకగా అందించారు. దీంతో చిత్రబృందం సభ్యులు రాంచరణ్‌కు ధన్యవాదాలు చెప్పారు.

మరోపక్క ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురం బీమ్‌గా ఎన్టీఆర్ అలరించారు. అలియా భట్ (సీత), ఒలివియా మోరీస్, శ్రియ, అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.