శంకర్ చిత్రం నుంచి లీకైన రాంచరణ్ ఫోటో.. - MicTv.in - Telugu News
mictv telugu

శంకర్ చిత్రం నుంచి లీకైన రాంచరణ్ ఫోటో..

April 5, 2022

rc15

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక, ఇప్పటికే సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి రాంచరణ్ ఫోటో లీక్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

లీకైన ఆ ఫోటోలో రాంచరణ్.. వైట్ కలర్ పంచెలో సైకిల్ ఎక్కి తొక్కుతున్నాడు. అంతేకాకుండా సాంప్రదాయ రీతిలో పంచె కట్టు, పక్క పాపిడి, చేతికి నల్ల కాశీ తాడు.. వైట్ అండ్ వైట్ లుక్‌లో హ్యాండ్ మడత పెట్టి, ఒక సాధారణ గ్రామ సర్పంచ్‌లా కనిపించాడు. దీంతో రాంచరణ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కొడుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు ఈ చిత్రంలో చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఒకటి స్టూడెంట్‌గా, రెండోది ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని మొన్నటివరకు అంటున్నా ఇప్పుడు మాత్రం తండ్రీకొడుకులుగా చరణ్ కనిపించబోతున్నాడట.

అయితే, ఈ ఫొటోలో చరణ్ పక్కా పొలిటీషియన్‌గా కనిపిస్తున్నాడు. 1980 లో ఒక ఫ్లాష్ బ్యాక్‌ను శంకర్ తెరక్కిస్తున్నాడట. అందులో చరణ్ ఒక రాజకీయ నాయకుడిగా నటిసున్నట్లు సమాచారం. తండ్రి బాటలోనే యంగ్ చరణ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ నుంచి పొలిటీషియన్‌గా మారతాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఈ ఫోటోను మాత్రం చరణ్ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు.