అకీరా.. మన బంధం బలపడుతోంది : రాంచరణ్ - MicTv.in - Telugu News
mictv telugu

అకీరా.. మన బంధం బలపడుతోంది : రాంచరణ్

April 8, 2022

fbfcbf

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ ఇవ్వాల 18వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాంచరణ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అకీరా.. మన బంధం రోజురోజుకు బలపడుతోంది. నిన్ను మేం చాలా ప్రేమిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే’అంటూ విష్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను 17 వేల మంది లైక్ చేశారు. నాలుగు వేల మంది రిట్వీట్ చేశారు. కాగా, అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడం గమనార్హం.