Ranchi Police Arrest Suspended BJP Leader Seema Patra For 'Torturing' Tribal Help
mictv telugu

పనిమనిషి నాలుకతో టాయిలెట్ క్లీన్ చేయించిన మాజీ ఐపీఎస్ భార్య అరెస్ట్

August 31, 2022

తన ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఓ గిరిజన మహిళను చిత్రహింసలకు గురిచేసినందుకు బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ భార్య సీమా పాత్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టుకు భయపడిన సీమా పాత్రా పరారయ్యారు. ఆమె కోసం గాలించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోని సునీత అనే పనిమనిషిని నాలుకతో టాయిలెట్‌ను శుభ్రం చేయించారు. సెల‌వులు అడిగితే త‌వ్రంగా కొట్ట‌డంతో పాటు గ‌దిలో బంధించార‌ని బాధితురాలు ఆరోపించింది. ఒక‌సారి త‌న‌ను ఇనుప రాడ్ తో కొడితే ప‌ళ్లు ఊడిపోయాయ‌ని కూడా పేర్కొంది.

ఈ క్ర‌మంలోనే బీజేపీ ఆమెపై చ‌ర్య‌లు తీసుకుంది. బీజేపీ నాయ‌కురాలైన సీమా పాత్ర ఫేస్ బుక్ ప్రొఫైల్ వివ‌రాల ప్ర‌కారం.. బీజేపీ మహిళా విభాగం జాతీయ కార్యవర్గ సభ్యురాలు. ఆమె భర్త రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి మహేశ్వర్ పాత్ర. సీమా పాత్ర కేంద్రానికి రాష్ట్ర కన్వీనర్ కూడా. కేంద్ర ప్రభుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌థ‌కం ‘బేటీ బచావో, బేటీ పడావో’ ప్రచార విభాగంలోనూ ఉన్నార‌ని స‌మాచారం. సీమా పాత్ర గత 8 ఏళ్లుగా బాధిత మ‌హిళ సునీతను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి.

సీమా పాత్రాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 164 కింద మంగళవారం సునీత వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేశారు. కాగా, పనిమనిషిపై అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా చిత్ర హింసలకు గురిచేసిన వార్తలు వెలుగులోకి రావడంతో ఝార్ఖండ్ బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. పని మనిషిని సీమా చిత్రహింసలకు గురిచేసిన వార్తలపై తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఆమెను అరెస్ట్ చేయాలంటూ ఝార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చాలని కోరారు.