మహిళా సర్పంచ్‌పై వేధింపులు.. ఆత్మహత్యాయత్నం  - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా సర్పంచ్‌పై వేధింపులు.. ఆత్మహత్యాయత్నం 

September 24, 2020

womenn

నేతల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో రంగాపూర్ గ్రామంలో ఇది చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కల్వకుర్తిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

రంగాపూర్ సర్పంచ్ ఝాన్సీరాణి సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శివారుల్లో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నారు. కానీ ఇది తమ భూమి అంటూ ఆనందరెడ్డి, నర్సింహారెడ్డి అనే వ్యక్తులు వారి కుటుంబంపై దాడి చేశారు. తిరిగి వారిపైనే కేసు పెట్టడంతో ఆమె తండ్రి చింత ఆంజనేయులు సహా కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. తమపైనే దాడి చేసి తిరిగి కేసు పెట్టడంతో ఆమె మనస్థాపానికి గురైంది. నెల రోజులు వారికి బెయిల్ రాకపోవడంతో నిద్ర మాత్రలు మింగారు. స్థానిక నేతల పలుకుబడితో తమపై కావాలనే కక్ష సాధింపునకు దిగుతున్నారని ఆమె సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్థానిక దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.