టీచర్ కొట్టాడని పారిపోయారు - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్ కొట్టాడని పారిపోయారు

November 22, 2017

రంగారెడ్డి జిల్లా కొత్తూరు జిల్లా మండలం ఫాతిమాపూర్ గ్రామంలోని ఫాతిమా మత పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు గ్రామం నుంచి పారిపోయారు.  ఎనిమిదో తరగతి చదువుతున్న వీరిని  పీటీ ఉపాధ్యాయుడు కొట్టాడు. దాంతో మనస్తాం చెందిన పారిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు  తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఉపాధ్యాయుడి వల్లే  తమ పిల్లలు కనిపించకుండా పోరాయరి ఆరోపిస్తున్నారు. అయితే తాను ఆ పిల్లలను కొట్టలేదని ఉపాధ్యాయుడు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని షాద్ నగర్  రూరల్ సీఐ మధుసూదన్ తెలిపారు. పిల్లలు దొరికితే కానీ అసలు నిజం  తెలియదు.