ఆ హీరోయిన్‌‌‌కు కరోనా వైరస్‌ సోకిందా! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ హీరోయిన్‌‌‌కు కరోనా వైరస్‌ సోకిందా!

February 4, 2020

 

n nh

కరోనా వైరస్ చైనా దేశంతో పాటు అనేక దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చైనాలో దాదాపు 370 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 17000 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. మన దేశంలోనూ కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది. కేరళలో ఇప్పటికే మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇదిలా ఉంటే కరోనా వైరస్ సోకిన లక్షణాలతో రాణి ఛటర్జీ అనే హీరోయిన్ బాధపడుతున్నట్లు సమాచారం. రాణీ ఛటర్జీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ‘గత10 రోజులుగా జ్వరం, జలుబు, తలనొప్పి, మైగ్రేన్‌తో బాధపడుతున్నా’నని దాని కింద క్యాప్షన్ రాసింది. దీంతో ఆమె అభిమానులు ఆమెకు కరోనా వైరస్ సోకి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పలు ఆగోగ్య సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమెకు కరోనా వైరస్ సోకిందా అనే అంశమై అధికారిక ప్రకటన వెలుబడాల్సిఉంది.