Rani quarreled with Sudha
mictv telugu

డ్యూటీ విషయంలో గొడవ.. తోటి మహిళా కానిస్టేబుల్ హత్యకు సుపారీ

September 20, 2022

హుళియారు పోలీస్ స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ సుధా హత్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెను తోటి మహిళా కానిస్టేబులే సుపారీ ఇచ్చి హత్య చేయించిన విషయం తాజాగా బయటపడింది. వివరాలు.. హుళియారు పోలీస్ స్టేషనులో సుధాతో పాటు రాణి అనే మహిళ కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. అయితే డ్యూటీ, డబ్బుల విషయంలో గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా, మూడు నాలుగు సార్లు ఇద్దరూ కొట్టుకున్నారు.

దీంతో ఎలాగైనా సుధను అడ్డుతొలగించుకోవాలని పథకం వేసిన రాణి.. సుధా హత్యకు అతని సోదరుడు మంజునాథకు సుపారీ ఇచ్చింది. మంజునాథ తన స్నేహితుడు నిఖేష్ సాయంతో సుధను ఆస్తి విషయంలో మాట్లాడాలని చెప్పి కారులో హసన్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే చంపేసి శవాన్ని పొదల మధ్య పడేసి వెళ్లిపోయాడు. తర్వాత భయాందోళనకు గురైన మంజునాథ.. శివమొగ్గకు చేరుకొని ఓ లాడ్జీలో ఉరేసుకొని చనిపోయాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధా, మంజునాథల ఘటనల మధ్య సంబంధం ఉందని తేల్చారు. తర్వాత లోతుగా విచారించగా, రాణి సుపారీ ఇచ్చిన విషయం బయటపడింది. దీంతో రాణి, నిఖేష్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండుకు తరలించారు.