ఆర్ధిక, ఆహార సంక్షోభం నేపథ్యంలో ప్రజల నిరసనలకు తలొగ్గి ప్రధాని పదవికి మహింద్ర రాజపక్స రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో శ్రీలంకకు కొత్త ప్రధానిగా గురువారం మాజీ ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే (73) బాధ్యతలు చేపట్టారు. ఆయనతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. మరో వారంలో నూతన కేబినెట్ కొలువుదీరనున్నట్టు ప్రకటించింది.
అంతేకాక, కొత్త మంత్రివర్గంలో రాజపక్స కుటుంబీకులు ఎవరూ ఉండరని తెలిపారు. దీంతో పాటు అధ్యక్షుడికి ఉన్న అధికారాలను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు గొటబయ స్పష్టం చేశారు. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విక్రమ సింఘే ఇంతకు ముందు ఆ దేశానికి ఐదు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఈయనకు భారత అనుకూల వ్యక్తిగా పేరుంది. తాజా మాజీ ప్రధాని సహీ రాజపక్స కుటుంబం చైనా అనుకూలురు అనే వాదన ఉంది. అందుకే శ్రీలంక చైనా చట్రంలో ఇరుక్కుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.