Ranil Wickremesinghe Resigns As Prime Minister Of Sri Lanka
mictv telugu

బ్రేకింగ్.. శ్రీలంక ప్రధాని రాజీనామా

July 9, 2022

Ranil Wickremesinghe

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది. ఆందోళనలతో ద్వీపదేశం అట్టుడుకుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోగా, పరిస్థితి మరింత దిగజారింది. కొన్నిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆందోళనకారులు ఇవాళ తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజధాని కొలంబోలో అధ్యక్ష భవనంతో పాటు సెక్రటేరియట్ ను ముట్టడించారు నిరసనకారులు. ఇప్పటికే ఆందోళనకు బయపడి దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు. తాజాగా ప్రధాని పదవకి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి చర్చించేందుక అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు రణిల్. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశం అనంతరం ఆయన తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేయడానికే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

Ranil Wickremesinghe Resigns As Prime Minister Of Sri Lanka