Ranji Trophy: Saurashtra beat Bengal by 9 wickets to bag second title
mictv telugu

రంజీట్రోఫీ విజేత సౌరాష్ట్ర.. ఫైనల్లో బెంగాల్ చిత్తు

February 19, 2023

Ranji Trophy: Saurashtra beat Bengal by 9 wickets to bag second title

దేశవాలీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మ రంజీ ట్రోఫీ -2022-23 టైటిల్‌ను సౌరాష్ట్ర ఎగరేసుకుపోయింది. ఫైనల్లో బెంగాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఉనద్కత్ ధాటికి ఫైనల్‌లో బెంగాల్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లతో చెలరేగిన జయదేవ్ ఉనాద్కత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో 907 పరుగులు చేసిన సౌరాష్ట్ర ప్లేయర్ అర్పిత్ వసవాడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్నాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చేతన్ సకారియా, జయదేవ్ ఉనాద్కత్ మూడేసి వికెట్లు తీశారు.
అనంతరం సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. అర్పిత్ వసవాడ(81), షెల్డన్ జాక్సన్(59), హర్విక్ దేశాయ్(50), చిరాగ్ జెనీ(60) హాఫ్ సెంచరీలతో రాణించారు. 230 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్.. 241 పరుగులకు కుప్పకూలింది. 6 వికెట్లు తీసిన ఉనద్కత్ బెంగాల్ పతనాన్ని శాసించాడు.
బెంగాల్ బ్యాటరల్లో మనోజ్ తివారి(68), అనుస్టప్ ముజుందార్(61)లో ఫర్వాలేదనిపించారు . 12 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 2.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి చాంపియన్‌గా నిలిచింది. గత మూడు సీజనల్లో సౌరాష్ట్ర రెండు సార్లు టైటిల్‎ను గెలుచుకుంది.