రణ్‌వీర్‌సింగ్ బాలీవుడ్‌కు ఇప్పుడు రెండో మెగాస్టార్. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ అతణ్ణి స్టార్ హీరోని చేశాయి. ఈ నేపథ్యంలో అతని ఇంటి ముందు నిర్మాతలు క్యూలు కడుతున్నారు. వద్దన్నా అడ్వాన్సులు చేతిలో పెట్టి వెళుతున్నారు. ఓ పక్క వరుసగా సినిమాలు చేస్తూనే మరోపక్క వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. రణ్వీర్ కూడా తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కాగా రణ్‌వీర్‌కు ఈ మధ్య ఓ ఖరీదైన ఆఫర్ వచ్చింది.
ఓ వ్యక్తి తన ఇంట్లో జరిగే పెళ్లికి అరగంట పాటు డ్యాన్స్ చేయాలని రణ్వీర్ను కోరాడట. ఇందుకోసం రూ.2 కోట్లు ఇస్తానని కూడా చెప్పాడు. కానీ రణ్వీర్ ఆ అవకాశాన్ని చల్లగా తిరస్కరించాడు. ఆ పెళ్లి వేడుకలో అరగంట మాత్రమే తన డాన్స్‌తో కనువిందు చేయాల్సి వస్తుండే. కానీ రణ్వీర్ అలా వద్దనుకున్నాడు. తను తాజాగా నటిస్తున్న ‘ గల్లీబాయ్ ’ సినిమా మీద ఈ డాన్స్ ఎఫెక్ట్ పడుతుందనుకొని ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. డబ్బుల కన్నా కెరియర్ ముఖ్యమని నమ్మాడు.
ఈ సినిమా కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అతని కోరిక మేరకు పెళ్లికి వచ్చి డ్యాన్స్ చేస్తే తన పాత్రపై శ్రద్ధ పెట్టలేనని, ఈ అవకాశానికి తాను ఒప్పుకోనని రణ్వీర్ తన మేనేజర్‌తో చెప్పించాడట. జోయాఅక్తర్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ సినిమా కోసం రణ్వీర్ చాలా కసిగా పని చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానున్నది ఈ చిత్రం. పద్మావత్ కోసం బరువు పెరిగిన తను ఈ సినిమా కోసం బరువు తగ్గాడు.