బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. రీసెంట్గా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ హీరో న్యూడ్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్స్ కొంత మంది ఇలాంటి న్యూడ్ ఫొటో షూట్స్ చేశారు. బాలీవుడ్లో ఇటువంటి షూట్స్ చేసిన వారి చాలా తక్కువ మంది. ఇప్పుడు రణవీర్ సింగ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ.. మరికొంతమంది హీరోలు సెమీ న్యూడ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను రణవీర్ సింగ్ పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు. చెంబూర్ పోలీస్ స్టేషన్ లో రణవీర్ పై అశ్లీలత, అసభ్యతకు సంబంధించి 292, 293, 509 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67 (A) సెక్షన్ కింద ముంబైకి చెందిన న్యాయవాది వేదిక చౌబే ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన ఫొటోల ద్వారా రణవీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశారని, వారి నిరాడంబరతను అవమానించారని చౌబే తన ఫిర్యాదులో ఆరోపించారు
ముంబైకి చెందిన ఓ ఎన్జీఓ కూడా రణవీర్‌పై ఇదే పీఎస్ లో కంప్లైంట్ చేసింది. మహిళల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈ ఫొటోలు ఉన్నాయని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అలానే ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినవారు డిమాండ్ చేస్తున్నారు.