Rao Ramesh financial assistance to make-up man babu donatin
mictv telugu

రావు రమేష్ పెద్దమనసు.. ఆ కుటుంబానికి 10 లక్షల సాయం

September 16, 2022

ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేష్ దయాహృదయం చాటుకున్నారు. ఇటీవల చనిపోయిన తన వ్యక్తిగత మేకప్ మేన్ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. తన మేకప్‌మెన్ బాబు చనిపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఇంటికివెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 10 లక్షల చెక్కు అందించారు. ఏ అవసరం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చి కూడా ఇచ్చారు. దీనిపై సినీపరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. సినిమాలనే నమ్ముకుని బతుకుతున్న కళాకారులను పెద్దనటులు, నిర్మాతలు ఆదుకోవాల్సిన అవసరముందని అంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రావు రమేశ్ విలన్, తండ్రి, బాబాయి, మామ వంటి కీలక పాత్రలు పోషిస్తుండడం తెలిసిందే. మొన్నటి తరం విలక్షణ నటుడు
రావు గోపాలరావు కొడుకైన రమేష్ చక్కని నటనతో సీనజనాల అభిమాం సంపాదించుకున్నారు.