Rao Ramesh is becoming a hero with Maruti Nagar Subrahmanyam movie
mictv telugu

హీరోగా రావు రమేష్ ఎంట్రీ.. జోడీగా అందాల తార

February 24, 2023

క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ తనేంటో నిరూపించుకున్న రావు రమేష్ ఇప్పుడు స్టార్ నటుడి హోదా అనుభవిస్తున్నాడు. తన కోసమే దర్శకులు పాత్రలు క్రియేట్ చేసేంత స్థాయికి ఎదిగిన ఆయన పుష్ప, కేజీఎఫ్ 2తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కొత్త బంగారు లోకం సినిమాలో లెక్చరర్ పాత్రతో పాపులర్ అయిన రావు రమేష్ సాదా సీదా పాత్రలను కూడా తన నటనతో నిలబెట్టగలరనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అలాంటి రావు రమేష్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

పీబీఆర్ బ్యానర్‌పై లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ మధ్యవయసు నిరుద్యోగి చుట్టూ తిరిగే కథతో 2 గంటల పాలు ప్రేక్షకులకు ఎంగేజ్ చేస్తుందని మేకర్స్ వెల్లడిస్తున్నారు. ప్రిప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రంలో రావు రమేష్‌కి జగతా అందాల తార, సీనియర్ హీరోయిన్, ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిలా వ్యవహిరిస్తున్న ఇంద్రజను ఎంపిక చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.