ఇంగ్లీష్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ఇంగ్లీష్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే

December 11, 2019

Varaprasad02

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు మీడియం కూడా నడపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక సభ్యుడు మాత్రం అధికార పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు. 

శీతాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.ఇది మంచి నిర్ణయమని, దీన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లిష్ మీడియం ప్రయత్నాలను జగన్‌ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేయడాన్ని ప్రశంసించారు. రాపక వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. పార్టీ విధానానికి ఆయన వ్యతిరేకంగా మారడం చర్చనీయాంశంగా మారింది.