ఆ నేరం చేయలేదంటూ.. అంగం కోసుకున్న ఖైదీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ నేరం చేయలేదంటూ.. అంగం కోసుకున్న ఖైదీ

November 21, 2018

క్షణికోద్రేకాలు దారుణాలకు దారితీస్తున్నాయి. సొంత కూతురిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీ ఒకరు తన మర్మాంగాన్ని బ్లేడుతో కోసి అవతలికి విసిరికొట్టాడు. కేరళలోని ఇడుక్కి జిల్లా పీర్మాదే సబ్ జైల్లో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

Telugu news Rape accused cuts off his penis at Kerala Idukki jail saying he didn't commit rape on his daughter  

42 ఏళ్ల వయసున్న ఖైదీ కొన్ని నెలలుగా జైల్లో ఉంటున్నాడు. అతనికి ఎవరూ బెయిల్ ఇవ్వడం లేదు. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడలేదని, గిట్టని వారు తనను ఈ కేసులో ఇరికించారని అతడు తోటి ఖైదీలకు చెప్పేవాడు. మంగళవారం జైలు సిబ్బంది ఖైదీలకు షేవింగ్ చేసుకోవడానికి బ్లేడ్లు పంచారు. సదరు ఖైదీ తన అంగాన్ని కోసేసుకుని కాంపౌండులో పారేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు అతణ్ణి కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఈ పని చేశాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఖైదీలకు బ్లేడ్లు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. క్షురకులను జైలుకు తీసుకొచ్చి వారితో ఖైదీలకు షేవింగ్ చేయించాలనే నిబంధనలు ఉన్నాయని హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

Telugu news Rape accused cuts off his penis at Kerala Idukki jail saying he didn’t commit rape on his daughter