అమ్మాయిలను చెరపడితే ఇతనిలా చచ్చిపోతారు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిలను చెరపడితే ఇతనిలా చచ్చిపోతారు..

February 22, 2018

అత్యాచారాలు, ఈవ్ టీజింగ్.. వగైరా నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిందితులు దొరకరు. దొరికినా వందకు 99 కేసుల్లో శిక్షలు పడవు దీంతో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్లవరకు అందరిపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పోలీసులు, కోర్టులు తమను ఏమీ చేయవనే ధైర్యం. అయితే కాలం మారింది. ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. మొన్న అరుణాచాల్ ప్రదేశ్‌లో ఇద్దరు రేపిస్టులను జనం పోలీస్ స్టేషన్ నుంచి లాక్కొచ్చి కొట్టి చంపడం తెలిసిందే.అలాంటి ఘటనే రాజస్థాన్లో జరిగింది. జైపూర్ నగరంలోని విశ్వకర్మ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫైజల్ అనే యువకుడు ఈ నెల 13న తమ పొరిగింట్లో ఉంటే మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. పాపను తనతోపాటు సమీపంలోకి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే ఎవరో ఆ విషయం పాప తండ్రికి చెప్పాడు. అతడు వెంటనే అక్కడికెళ్లి పాపను కాపాడుకున్నాడు.తర్వాత ఫైజల్ ను స్థానికులు దారుణంగా చితగ్గొట్టారు.కరెంటు స్తంభానికి కట్టేసి కాళ్లు, చేతులు,కర్రలతో చావబాదారు. తర్వాత పోలీసులు వచ్చి అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి చికిత్స పొందుతున్న ఫైజల్ బుధవారం ఆస్పత్రిలో మృతిచెందాడు.