ఏఎస్సై కూతురిపై హత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

ఏఎస్సై కూతురిపై హత్యాచారం

September 7, 2017

ఏఎస్సై కూతురినే రేప్ చేసి చంపారు మృగాళ్లు.  వాళ్ళు ఆమెకు స్నేహితులే కావడం గమనార్హం. ఫ్రెండ్ షిప్ పేర ఇలాంటి వికృతానికి పాల్పడ్డారా దుండగులు.. తొలుత అఘాయిత్యం చేసి ఆపై హత్య చేసి, శవాన్ని ఎక్కడో దూరంగా పారేసారు. 22 ఏళ్ళ వయసున్న ఆ బాధిత యువతి నాగ్ పూర్ కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కూతురు. అంబర్‌నాథ్ లోని విఖ్రోలి కి చెందిన ఐటీ కంపెనీలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటోంది. ఈ నెల 4న నిఖిలేష్ పాటిల్ అనే వ్యక్తి తన స్నేహితుడు నీలేష్ తో కలిసి ఆమె దగ్గరికెళ్ళాడు. అక్కడే ఉన్న మరో స్నేహితుడు అక్షయ్ వలోడే ఇంట్లో పార్టీ చేసుకుందామని ఆమెను ఆహ్వానించాడు.  చిన్నప్పటి ఫ్రెండు, పైగా అందరూ తెలిసిన వాళ్ళే అనే ధైర్యంతో ఆ అమ్మాయి పార్టీకి  హాజరైంది.

అందరూ అక్షయ్ ఇంటికి చేరుకున్నారు. పార్టీ అయిపోగానే నిఖిలేష్, అక్షయ్ లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె  పోలీస్ కంప్లైంట్ ఇస్తాననగానే వాళ్ళు బెదిరిపోయారు. విషయం బయటకు పొక్కితే తమ కెరియర్ పాడవుతుందన్న భయంతో ఆమెను వూపిరాకుండా చేసి చంపేశారు. తర్వాత శవాన్ని ఒక బ్యాగులో పెట్టుకొని కార్లో తీసుకెళ్ళారు. పుణె వెళ్ళే దారిలో కొల్హాపూర్ వద్ద డంప్ యార్డులో పారేసి వచ్చారు. ఇదంతా తెలీకుండా గది లోపలున్న నీలేష్ బయటికొచ్చి ఆ అమ్మాయి గురించి గట్టిగా అడిగాడట. వాళ్ళ డొంక తిరుగుడు సమాధానాలు విని అనుమానంతో గద్ధించేసరికి అసలు విషయం చెప్పేసారట. పారిపోతే చిక్కులు తప్పవని నీలేష్ హెచ్చరించడంతో చివరికి వాళ్ళిద్దరు రత్నగిరి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసును అంబర్ నాథ్ పోలీసులకు అప్పగించారు.