అమ్మాయిల అంగీకారంతో అత్యాచారాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిల అంగీకారంతో అత్యాచారాలు..

April 9, 2018

హరియాణా.. అత్యాచారాల అడ్డగా మారిపోతోంది. పపిపాపల నుంచి ముసలమ్మల వరకు మృగాళ్ల బారిన పడుతున్నారు. కొన్నేళ్లుగా అత్యాచార కేసులు భారీగా పెరిగాయి. కిడ్నాప్, గ్యాంగ్, రేప్, హత్యలు వెలుగు చూడని రోజే లేకుండా పోతోంది. ఒకపక్క ఈ ఘోరాలపై నిరసన వ్యక్తం అవుతోంది. అయితే మరోపక్క.. వీటికి పెద్దసంఖ్యలో సమర్థకులు బయల్దేదారు. రేప్ చాలా సహజమైన ప్రక్రియ అని, ఇందులో అమ్మాయిల పాత్రా ఉందని, వారి ఆమోదంతోనే రేప్‌లు జరగుతున్నాయంటున్నారు.

ద క్వింట్ వెబ్‌సైట్ అత్యాచారాలపై హరియాణా ప్రజల మనోగతాలను తెలుసుకునే క్రమంలో ఈ షాకింగ్ మాటలు బయటికొచ్చాయి. మెజారిటీ జనం అమ్మాయిలదే తప్పన్నారు. ‘రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అమ్మాయిలు బయటతిరగొద్దు, అబ్బాయిలు ఏమైనా చేయొచ్చు.. అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే అబ్బాయిలు ఆకర్షితులై రేప్ చేస్తారు.. అత్యాచారం మన సంస్కృతిలో భాగం. ఇకముందూ కొనసాగుతుంది. 15, 16 అమ్మాయిని రేప్ చేస్తే రేప్ అనకూడదు.. అది సెక్స్ అంతే…’.. ఇలాంటి మాటలే మాట్లాడారు. ఏదో తెలిసీతెలియని పిల్లలు కాదు. పండు ముసళ్లు కూడా ఇదే అన్నారు. స్కూలు పిల్లలైతే రేప్‌లు మగపిల్లల హక్కు అన్నట్లు వాదించారు.

హరియాణాలో అత్యాచారాలు పెరగడానికి ఇలాంటి పాడైపోయిన పుచ్చుబుర్రలు కూడా కారణం. చివరకు పోలీసుల తీరు కూడా అదే. అందరూ అమ్మాయిలదే నేరం అన్నట్లు మట్లాడారు. ఇటీవల అత్యాచారానికి గురైన ఒక గ్రామంలోని పెద్దలతోనూ  క్వింట్ మాట్లాడింది. అత్యాచారాలకు కారణం ఎవరు అని ప్రశ్నించగా.. ‘అమ్మాయిలే..’ అని చెప్పుకొచ్చారు. కొందరు ఆడవాళ్లయితే మగాళ్లను వెనుకేసుకొచ్చారు. ‘అది రేప్ కాదు. తప్పు.. అంతే. కానీ అబ్బాయిలనే జైలుకు పంపుతున్నారు. ఇదేం న్యాయం?’ అని ఎదురు ప్రశ్నించింది.