అమెరికాలో నడిరోడ్డుపై అత్యాచారం.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో నడిరోడ్డుపై అత్యాచారం..

February 7, 2018

కొన్ని నెలల కిందట విశాఖపట్నంలో ఒక యాచకురాలిపై ఒక తాగుబోతు పట్టపగలు అత్యాచారం చేయడం తెలిసిందే. రోడ్డుపై వెళ్తున్న జనం ఈ ఘోరాలు వినోదంగా చూసినట్లు చూశారేగాని అడ్డుకోలేకపోయారు. ఇలాంటివి కేవలం మనదేశంలోనే జరుగుతాయి అని అనుకుంటే పొరపాటే. అగ్రరాజ్యమైన అమెరికాలోనూ నడిరోడ్డుపై లైంగిక దాడులు సాగుతున్నాయి.
లాస్ వెగాస్ మహానగరంలోని ఇటీవల రోడ్డుపక్కన ఒక మహిళపై ఒక కామాంధుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో రోడ్డుపై పడిపోయిన మహిళపై పడుకుని పైశాచికానికి ఒడిగట్టాడు. చుట్టూ ఉన్న జనం ఆ దృశ్యాలను దగ్గరికొచ్చి కళ్లప్పగించి మరీ చూశారు తప్పితే అతన్ని లాగి చెంపదెబ్బలు కొట్టలేకపోయారు. కొందరు వీడియోలు తీసుకున్నారు.. దుండగుడు మహిళలపై పడుకుని, ఆమెకు ముద్దులు పెడుతూ వెకిలిగా నవ్వుతూ చాలాసేపు గడిపాడు. ఎవరో ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.