కొడుకులను బాధ్యతగా పెంచండి.. మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకులను బాధ్యతగా పెంచండి.. మోదీ

April 24, 2018

దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ఘోరాలపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘాతుకాల నిరోధానికి అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ కుమార్తెలను గౌరవంగా చూసుకోవాలని, కొడుకులను మరింత బాధ్యతాయుతంగా పెంచాలని కోరారు.

ఆయన మంగళవారం మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని రామ్‌నగర్‌లో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ సమ్మేళనంలో ప్రసంగించారు.

అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేశాం. ఈ విషయంలో మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. కానీ ప్రభుత్వం ఒకమేరకే అడ్డుకోగలుతుంది. అమ్మాయిలకు పూర్తి రక్షణ ఉండాలంటే వారిని గౌరవంగా చూడాలి. మగపిల్లలను మరింత బాధ్యతాయుతంగా పెంచాలి.. మహిళలు, బాలికల భద్రత కోసం సామాజిక ఉద్యమం రావాలి’ అని ప్రధాని అన్నారు.