తండ్రిపై కక్షతో  పసిమొగ్గను చిదిమేశాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రిపై కక్షతో  పసిమొగ్గను చిదిమేశాడు..!

December 6, 2017

ఏడేళ్ల రేష్మపై పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన మృగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో ఆదివారం ఈ బాలికపై ఘాతుకం జరిగిన సంగతి తెలిసిందే. రేష్మ తండ్రిపై పాతకక్షతో అదే గ్రామానికి చెందిన కనకం శివ అనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.తన అన్న కుమార్ ప్రేమ విషయంలో రేష్మ తండ్రి రాజు అడ్డుతగిలాడని శివ చెప్పాడు. దీంతో కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, దీనిపై కక్ష సాధించడానికి రాజు కూతురిని అత్యాచారం చేసి చంపేశానని తెలిపాడు. శివపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు పెట్టారు. అతనికి ఉరిశిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాగా, శివను ఎన్ కౌంటర్ చేయాని బాలిక బంధువులు కోరుతున్నారు.