అత్యాచారం జరిగింది..ప్రభుత్వ వాహనంలోనే: సీవీ ఆనంద్ - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచారం జరిగింది..ప్రభుత్వ వాహనంలోనే: సీవీ ఆనంద్

June 8, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పదకొండు రోజుల క్రితం ఓ బాలికపై కొంతమంది యువకులు పార్టీ పేరుతో సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యాయి. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు, కుటుంబ సభ్యులు, పలువురు రాజకియ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం పూర్తి వివరాలను వెల్లడించారు

”అత్యాచారం చేసిన ఆరుగురు నిందితులని గుర్తించాం. ఇందులో సాదున్ (18) ప్రధాన నిందితుడు. మిగిలిన అయిదుగురు మైనర్లు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ బాలుర్ల పేర్లు గాని, వివరాలు గాని వెల్లడించకూడదు. మే 28న ఈ సంఘటన జరిగింది. మే 31న బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. బాధితురాలి వాంగ్మూలం మేరకు సామూహిక అత్యాచారంగా పరిగణించి దర్యాప్తు చేశాం. ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్ ఉన్న ఇన్నోవా కారులోనే సామూహిక అత్యాచారం జరిగింది. వెంటనే నిందితులను గుర్తించాం. నిందితుడు సాదుద్దీన్‌ను అరెస్టు చేశాం. అయిదుగురు మైనర్ నిందితులను జువైనల్ హోంకు పంపించాం” అని ఆయన అన్నారు.

మరోపక్క బాధితురాలిపై అత్యాచారం చేయాలని నిందితులు అమ్నీషియా పబ్ వద్దనే నిర్ణయించుకున్నారట. ముందుగా ఆమెను బెదిరించి, మెర్సిడెజ్ కారులో ఎక్కించుకున్నారట. అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని కాన్సూ బేకరీ వద్ద ఆమెను ఇన్నోవా కారులోకి మార్చి, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని నిర్జన ప్రదేశంలో సామూహికంగా అత్యాచారం చేశారట. ఈ వ్యవహారంలో హోంమంత్రి మనవడికి సంబంధం లేదని, ఎవరైనా ఆధారాలు తీసుకువస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.