‘పదేళ్ల తల్లి’కి ఎంత కష్టం.. - MicTv.in - Telugu News
mictv telugu

‘పదేళ్ల తల్లి’కి ఎంత కష్టం..

August 17, 2017

ముక్కుపచ్చలారని పదేళ్ల చిన్నారి.. ఓ కామాంధుడి పైశాచికం ఫలితంగా గర్భం దాల్చింది… ఆ విషయం తెలిసేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది..

30 వారాలన్ని గర్భాన్ని తొలగించడానికి సుప్రీం కోర్టు అనుమితివ్వలేదు.. నెలలు నిండాయి.. ప్రసవం రోజు దగ్గరపడింది.. తనకేం జరుగుతోందోని ఆ పసిపిల్ల అమాయక ప్రశ్నలు వేసింది.విషయం చెప్పలేక వైద్యులు ఇబ్బంది పడ్డారు..ప్రసవ సమయంలో చిన్నారిని సముదాయించడానికి చివరికి అబద్ధం చెప్పారు..

‘‘నీ కడుపులో ఒక రాయి ఉంది.. దాన్ని తీసేయడానికి ఆపరేషన్ చేస్తున్నాం.. ’’ అని.ఆ చిన్నారి ‘‘అవునా..’’ అని ఊకొట్టింది.గురువారం చండీగఢ్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. నెలల నిండని, తక్కువ బరువు ఉన్న మరో పసికూన జన్మించింది. బాధితురాలి శరీరం సహజ ప్రసవానికి సహకరించదు కనుక సిజేరియన్ చేశామని వైద్యులు చెప్పారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. చివరి వార్తలు అందేసరికి తల్లి ఇంకా ఆపరేషన్ థియేటర్లో ఉంది. నవజాత శిశువును ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు. అత్యాచార బాధితులు.. ముఖ్యంగా బాలికలు ఆ ఘోరాల సమయంలోనే కాదు తర్వాత కూడా ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో చెప్పడానికి ఈ ఉదంతం ఒక్కటి చాలు.ఈ బాలిక కుటుంబం నేపాల్ నుంచి భారత్ కు వలస వచ్చింది. స్వయంగా మేనమామే ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కడుపునొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది.
ఆ బిడ్డను ఏం చేస్తారు?

బాలిక జన్మనిచ్చిన బిడ్డను ఆమె పోషించలేదు కనుక నిబంధనల ప్రకారం ఎవరికైనా దత్తత ఇస్తారు. ఇందుకు బాధితురాలి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పసికూనను బాలల సంక్షేమ కమిటీ తన అధీనంలోకి తీసుకుని సంరక్షిస్తుంది. రెండు నెలల వయసు తర్వాత దత్తత ప్రక్రియ ప్రారంభిస్తుంది.