వాడు అత్యాచారం చేశాడు.. ఊరోళ్లు ఇంకా ఘోరం చేశారు..! - MicTv.in - Telugu News
mictv telugu

వాడు అత్యాచారం చేశాడు.. ఊరోళ్లు ఇంకా ఘోరం చేశారు..!

February 13, 2018

అత్యాచార బాధితులు మౌనంగా రోదిస్తోన్న దేశం మనది. మరోపక్క ఆ దారుణానికి తెగబడిన కామాంధులు తల ఎత్తుకుని గర్వంగా తిరుగుతున్న దేశమూ మనదే. తప్పంలీ ఆడవాళ్లదేనని, వారివల్లే మగవాళ్లు చెడిపోతున్నారని వాదించేవాళ్లకు కొదవలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుద్ధీకరణతో పేరుతో ఒక అత్యాచార బాధితురాలిని ఘోరంగా అవమానించారు.

కవర్దాలో 13 ఏళ్ల బాలికపై ఇటీవల అర్జున్ యాదవ్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఊరిపెద్దలకు ఫిర్యాదు చేశారు. అయితే వారు అమానవీయంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బహిష్కరించారు. అంతటితో ఆగకుండా ఆమెకు అరగుండు చేయించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు పెట్టి, నిందితుణ్ని అరెస్ట్ చేశారు. ఆ బాలికను అవమానించి, గుండుగీయించిన గ్రామపెద్దలు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.