రగిలిన తల్లిగుండె.. ఆమెకు వంద చేతులు ఉండాల్సింది! - MicTv.in - Telugu News
mictv telugu

రగిలిన తల్లిగుండె.. ఆమెకు వంద చేతులు ఉండాల్సింది!

March 22, 2018

మధ్యప్రదేశ్  రాజధాని ఇండోర్‌లో పసిమొగ్గలపై అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయి. నగరంలో దాదాపు రోజూ ఎక్కడో ఒకఃచోట కామాంధులు అమ్మాయిలను కాటేస్తున్నారు. తన కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఓ మృగాడిని ఓ మహిళ రోడ్డుపై చెంపలు వాయించింది. జట్టుపట్టుకుని కొట్టింది. అయినా ఆ తల్లి గుండె రగిలిపోతూనే ఉంది.

ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసినవారు.. ఆ తల్లికి ఓ కర్రో, కత్తో ఇచ్చి ఉండాల్సిందని, వాడిని చావచితగ్గొడితే ఆమె ఆగ్రహం అప్పటికైనా చల్లారేదని కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు కాకుండా వంద చేతులు ఉండాల్సిందని, ఆ దెబ్బలకు వాడు చచ్చిపోయుంటే బావుండునని అంటున్నారు.

ఈ కేసు వివరాలు పూర్తిగా తెలియడం లేదు. అత్యాచారానికి గురైన యువతిని పోలీసులు వైద్య పరీక్షలు పంపి, నిందితుణ్ని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లి ఠాణాకు వచ్చి ఆ దుండగుణ్ని చూడగానే కోపంతో రగలిపోయింది. చెంపలు వాయిస్తూ, జట్టుపట్టుకుని ఈడుస్తూ పోయింది. పోలీసులు కూడా ఆమె ధర్మాగ్రహాన్ని నిలువరించలేకపోయారు.