చెరిచిన దేహంపైనే సూసైడ్ నోట్ రాసుకుని.. - MicTv.in - Telugu News
mictv telugu

చెరిచిన దేహంపైనే సూసైడ్ నోట్ రాసుకుని..

March 20, 2018

స్త్రీని దేవతలా పూజించే ఘనభారత దేశంలో అడ్డూఅదుపూలేకుండా కొనసాగుతున్న అత్యాచారకాండలో మరో దారుణం. కామాంధులు కాటేసిన తన దేహాన్నే ఓ యువతి సూసైడ్ నోట్‌గా మార్చేసింది. ఆ మృగాళ్లను ఉరితీయాలని వారి పేర్లను తన దేహంపై రాసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నేరాలకు అడ్డగా మారిపోయిన ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘోరం జరిగిది.

కాన్పూర్‌లోని దెహాత్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బీఏ విద్యార్థినిపై ఇద్దరు ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంగతి అందరికీ తెలిసే పరువుపోతుందని భావించిన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు తన శరీరాన్నే సూసైట్ నోట్ గా మార్చేసింది. ‘నా చావుకు పక్క ఊళ్లో ఉండే సంజయ్, అతడి మరదలు రూబీ, వాళ్ల దగ్గర పనిచేసే సోనూనే కారణం. వాళ్లను ఉరితీయండి’ అని ఒళ్లంతా  రాసుకుంది.  పోలీసులు ఆ నోట్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.