Raped by 10-15 men every day at Gurugram spa, ordeal recorded, alleges teen
mictv telugu

స్పాలో ఘోరం.. బాలికపై రోజూ 10-15 మంది లైంగికదాడి

September 17, 2022

Raped by 10-15 men every day at Gurugram spa, ordeal recorded, alleges teen

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మసాజ్ సెంటర్ లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ బాలికను మభ్యపెట్టి, ఆమెపై రోజులు తరబడి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ‘స్పా’ను నడిపిస్తున్న ఓనర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల బాలికకు ఆగస్టులో ఓ మహిళ పరిచయమయ్యింది. ఆమె గురుగ్రామ్లోని సోహ్నా రోడ్డులోని ఓ స్పా సెంటర్ నిర్వహిస్తోంది. బాధిత బాలికకు రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టింది. సంతోషంతో ఆ బాలిక ఆ ఉద్యోగంలో చేరింది.

ఉద్యోగంలో చేరిన మొదటిరోజు ఆ స్పా సెంటర్‌కు ఓ యువకుడు మసాజ్ చేయించుకునేందుకు వచ్చాడు. ఆ సమయంలో ఈ బాలికను అతని రూంలోకి బలవంతంగా నెట్టారు. బాలిక నిరాకరించడంతో కొట్టి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బాలిక ఇక ఉద్యోగం మానేస్తానని చెప్పగా, అదే స్పాలో ఉన్న మరో యువకుడు తన రేప్ వీడియోను బయటపెడతానని, గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తామని బెదిరించాడని బాలిక తెలిపింది.

ఇక చేసేదేమి లేక ఉద్యోగంలో కొంత కాలం కొనసాగింది. రోజూ ఆమెపై దాదాపు 15మంది గ్యాంగ్ రేప్‌కి పాల్పడేవారని.. ఆ బాధ భరించలేక అక్కడి నుంచి బయటకు వచ్చానని తెలిపింది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులును ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. విషయం విన్న పోలీసులు ఆమె స్టేట్మెంట్ ఆధారంగా తీసుకుని వేర్వేరు సెక్షన్లతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పా సెంటర్ నిర్వహిస్తున్న మహిళను, ఆమె ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.