రిజర్వేషన్ల వల్లే అత్యాచారాలు! - MicTv.in - Telugu News
mictv telugu

రిజర్వేషన్ల వల్లే అత్యాచారాలు!

September 7, 2017

కొంతమందికి తామేం మాట్లాడుతున్నామో తమకే తెలియకుండా వాగేస్తుంటారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ఈ కోవలోకే వస్తాడు. దేశంలో మహిళలపై అత్యాచారాలకు రిజర్వేషన్లే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. కులాంతర వివాహాలు పెరిగితే అత్యాచారాలు తగ్గుతాయన్నారు. అయితే ఇది ఎలా సాధ్యమో అమాత్యవర్యులు సరిగ్గా వివరించలేదు. ఆయన గురువారం హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీపై అఘాయిత్యాల కేసుల్లో ఉత్తరప్రదేశ్ తొలిస్థానంలో ఉందని, తెలంగాణ ఐదవ స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన అన్ని కులాల వారూ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నారని, దీనిపై కేంద్ర సర్కారుకు నివేదికలు ఇచ్చామని చెప్పారు. ఆర్మీతోపాటు క్రికెట్ జట్టులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న రాందాస్.. రిజర్వేషన్ల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉంది.