పెళ్లికి సిద్దమైన బిగ్‌బాస్ హౌస్ జంట - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి సిద్దమైన బిగ్‌బాస్ హౌస్ జంట

October 22, 2019

అన్ని భాషల్లో సంచలనం అయిన టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్.. ప్రేమ పెళ్లిళ్లకు వేదిక అవుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో కలిసిన ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్దమవ్వడమే ఇందుకు ఉదాహరణ. కన్నడ ర్యాపర్ చందన్, నటి నివేదితా గౌడలు బిగ్ బాస్ కన్నడ సీజన్-6లో పాల్గొన్నారు. అక్కడ వారి మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

Rapper chandan.

వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవలి మైసూరులో జరిగిన దసరా ఉత్సవాల్లో ఓ వేదికపై తమ వివాహాన్ని వీరు ప్రకటించారు. దసరా ఉత్సవాల వేదికపై పెళ్లి ప్రకటన ఏంటని విమర్శలు రాగా, క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా సోమవారం చందన్, నివేదితల నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని, అభిమానుల సమక్షంలో తమ వివాహం జరుగుతుందని ఈ సందర్భంగా వారిద్దరూ తెలిపారు.