లాక్‌డౌన్ ప్రభావం.. తిరుమల కొండపై వింత పిల్లులు - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ ప్రభావం.. తిరుమల కొండపై వింత పిల్లులు

May 26, 2020

mfnb

లాక్‌డౌన్ కారణంగా తిరుగిరులు నిర్మానుషంగా మారిపోయాయి. జనం అలికిడి లేకపోవడంతో వన్యప్రాణాలు అరన్యాన్ని వదిలి బటయకు వస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి సమయాల్లో వింత జీవులు, వన్య మృగాలు ప్రత్యక్షమౌతున్నాయి. తాజాగా ఘాట్‌రోడ్డులో వింత పిల్లులు దర్శనమిచ్చాయి. దేవాంగ పిల్లులుగా పిలవబడే రెండు పిల్లులను అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫొటోలను తీయడంతో చాలా మంది వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

రెండో ఘాట్‌ రోడ్డులోని చివరి మలుపు వద్ద నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు వీటిని గుర్తించారు. వింతగా కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి వాటిని పరిశీలించి దేవంగా పిల్లులుగా తేల్చారు. వాటికి అడవిలోకి తిరిగి వెళ్లేలా ఏర్పాటు చేశారు.  అరుదైన జాతికి చెందిన ఈ దేవాంగ పిల్లులు అప్పుడప్పుడు శేషాచలం అటవీప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయని చెప్పారు. మొత్తానికి లాక్‌డౌన్ కారణంగా శేషాచలం అడవుల్లో ఉన్న వింత జంతువులు బయటకు వస్తుండటం విశేషం.