ఈ నాణెం విలువ అక్షరాలా..రూ.9.10 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నాణెం విలువ అక్షరాలా..రూ.9.10 కోట్లు

January 19, 2020

gjrgdjhukrg

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అన్నట్లుగా..ఒక్కొక్కరికీ ఒక్కో హాబీ ఉంటుంది. అలాంటి వాటిలో నాణాల సేకరణ ఒకటి. కొందరు అరుదైన నాణాలను సేకరిస్తుంటారు. వేలంలో వాటిని దక్కించుకోవడానికి డబ్బు కూడా ఖర్చు చేస్తూ ఉంటరు. వేలల్లో.. లక్షల్లో అయితే పర్వాలేదు. కానీ, ఓ వ్యక్తి ఓ అరుదైన నాణాన్ని దక్కించుకోవడానికి ఏకంగా రూ.9.10కోట్లు వెచ్చించాడు.

ఒకప్పటి బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ ముద్రించి ఉన్న అరుదైన ఈ బంగారు నాణెం ఇటీవల జరిగిన వేలంలో దాదాపు రూ.9.10 కోట్ల ధరపలికింది. పేరు, ఇతర వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. 1936లో కింగ్ ఎడ్వర్డ్-8 అమెరికన్ మహిళ విల్లిస్ సింప్సన్‌ను వివాహం చేసుకునేందుకు ఏకంగా సింహాసనాన్నే పరిత్యజించడానికి ముందు కాలానికి చెందిన నాణెంగా భావిస్తున్నారు. ఈ నాణాన్ని సొంతం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పోటీ పడ్డారని నిర్వాహకులు తెలిపారు.