శ్రీకాకుళంలో అరుదైన ఘటన.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాకుళంలో అరుదైన ఘటన.. వీడియో వైరల్

May 11, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఓ బంగారు మందిరం కొట్టుకొచ్చిన సంఘటన అందరినీ ఆశ్యర్యపరిచింది. ‘అసని’ తుపాన్ కారణంగా కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. వర్షం కారణంగా సముద్రాల అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో విదేశాలకు చెందిన ఓ బంగారు వర్ణంలో ఉన్న ఓ రథం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవు ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

అధికారుల వివరాల ప్రకారం..”ఈ రథంపై 16-1-2022తో పాటు విదేశీభాష కనిపిస్తోంది. ఇది థాయిలాండ్ లేదా మలేషియా లేదా జపాన్ దేశాలకు చెంది ఉండొచ్చు. హుదూద్, తిత్లీ వంటి పెను తుపానులు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడూ కొట్టుకుని రాలేదు. సముద్రంలో ఇంత దూరం రథం కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రథాన్ని చూడ్డానికి స్థానికులు పోటెత్తున్నారు”.

మరోపక్క ఈ రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి అరుదైన ఘటనను ఎప్పుడు చూడలేదని మత్స్యకారులు తెలిపారు. ఆ రథానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.