35 ఏళ్ల మహిళకు పునర్జన్మ..! - Telugu News - Mic tv
mictv telugu

35 ఏళ్ల మహిళకు పునర్జన్మ..!

July 25, 2017

నిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. క్యాన్సర్ పేషెంట్ కు కృత్రిమ అన్నవాహికను అమర్చారు. 35 ఏళ్ల మహిళకు పునర్జన్మ ప్రసాదించారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప.

ఇక్కడ కనిపిస్తున్న ఈమెకు 2011 స్వరపేటిక క్యాన్సర్ నిర్దారణ అయింది. ఓ హాస్పిటల్ లో రెడియో థెరపీ తర్వాత నాలుగేళ్లు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి తిన్న ఆహారం గొంతు నుంచి కిందకు దిగలేదు. పరీక్షలు చేస్తే వ్యాధి మళ్లీ తిరగదోడింది. 2015 లో ఆమెకు ఆపరేషన్ చేసి స్వరపేటికతో పాటు గొంతు పై భాగంలో అన్నవాహిక భాగాన్ని వేరే చోటు నుంచి తీసేసిన కండరంతో తిరిగి నిర్మించడంతోపాటు, గాలీ తీసుకునే నాళానికి రంధ్రం చేశారు. కానీ పలుమార్లు చేసిన ఆపరేషన్లు ఫలించలేదు. చివరకు ముక్కు ద్వారా ఆహార నాళానికి పైపు వేసి ఆహారం పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా నాలుగు నెలలు గడిచాయి. పైపు ద్వారా ఫుడ్ తీసుకుంటున్న ఈ మహిళ చిన్న ఆశతో నిమ్స్ వైద్యుల్ని కలిసింది. అరుదైన ఆపరేషన్ తో కృత్రిమ అన్నవాహికను అమర్చారు. 35 ఏళ్ల మహిళకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాజీ డిపార్ట్ మెంట్.