ఉత్తరాఖండ్‌లో వింత ఇంట్లోకి ఎర్ర రంగు పాము - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తరాఖండ్‌లో వింత ఇంట్లోకి ఎర్ర రంగు పాము

October 26, 2020

house

ఉత్తరాఖండ్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి ఎరపు వర్ణంలోని పాము వచ్చింది. దాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. యూఎస్ నగర్ లోని దినేష్పూర్ ప్రాంతంలోని  త్రిలోకి అనే వ్యక్తి ఇంట్లో ఇది ప్రత్యక్షమైంది. వెంటనే స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇంటి ప్రాంగణంలోని ఒక చెట్టు దగ్గర నక్కి ఉండగా గుర్తించారు. దాన్ని రక్షించి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అది అరుదైన కూక్రీ పాముగా అధికారులు తెలిపారు. 

కాగా ఈ ఏడాదిలో ఇది మరో పాముగా చెప్పారు. ఆగస్టు 7న అలాగే సెప్టెంబర్ 5న నైనిటాల్ ప్రాంతంలో వీటిని గుర్తించారు. మొదటిసారిగా 1936లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ప్రాంతంలో గుర్తించారు, దాని నుండి దీనికి శాస్త్రీయ నామం ‘ఒలిగోడాన్ ఖేరిన్సిస్’గా పేర్కొన్నారు. రాత్రిపూట వానపాములు, కీటకాలు, లార్వాలను తినేందుకు బయటకు వస్తాయన్నారు. దానికి  విషం ఉండదని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.