ఇంటికొచ్చిన రెండు తలల అతిథి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటికొచ్చిన రెండు తలల అతిథి..

May 8, 2020

Rare Snake With Two Fully Formed Heads Found In Odisha

లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు, వన్యప్రాణులు ఇళ్లలోకి వస్తున్నాయి. ఇటీవల గుజరాత్ లోని ఓ స్కూల్ లోకి సింహం వెళ్లిన సంగతి తెల్సిందే. తాజాగా గురువారం ఒడిశాలో అరుదైన రెండు త‌ల‌ల పాము ఇళ్లలోకి వచ్చింది.

కియోంజార్‌లోని ఓ ఇంట్లో ఈ పాము ప్రత్యక్షమైంది. దీన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచార‌మిచ్చారు. వారు ఆ పామును ప‌ట్టుకుని ద‌గ్గ‌ర‌లోని అడవిలో వ‌దిలిపెట్టారు. దీన్ని తోడేలు పాము(ఉల్ఫ్ స్నేక్‌) అని కూడా అంటారని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను అట‌వీ శాఖ అధికారి సుశాంత్ నందా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.