రెండు తలల రక్తపింజర.. దీన్ని కూడా అమ్ముకోండి..  - MicTv.in - Telugu News
mictv telugu

రెండు తలల రక్తపింజర.. దీన్ని కూడా అమ్ముకోండి.. 

August 10, 2020

Rare Two-Headed Russell's Viper Found In Maharashtra...

ఈ సృష్టిలో వింతలకు కొదవల లేదు. ఏ మూగజీవైనా కాస్త తేడాగా ఉంటే చాలు మానవజాతి లగెత్తుకుని లాక్కుంటుంది. రెండు తలలు లేకున్నా శాండో బో జాతి పాములను విపరీతంగా స్మగ్లింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరకు కరోనాకు కారణమైందంటున్న అలుగు(పొలుసు పంది)ని కూడా జనం వదలడం లేదు. అలాంటి వారికి సవాల్ విసురుతూ ఓ రక్తపింజరకు కూడా రెండు తలకాయలతో బయటపడింది. 

అత్యంత విషపూరితమైన రక్తపింజరలు వర్షాకాలంలో పెద్దసంఖ్యలో బయటపడుతుంటాయి. ముంబై శివారులోని కల్యాన్ గాంధేరేలో ఇటీవల రెండు తలల రక్తపింజర పిల్ల కనిపించింది. శాండ్ బో పాముల్లా ముందొక తల, వెనకొక ‘తల’ కాకుండా రెండూ ముందువైపే ఉన్నాయి దీనికి. రెస్క్యూ సిబ్బంది దీన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ‘డబుల్ డేంజర్’ అంటూ అటవీ అధికారి సుశాంతా నందా దీని వీడియోను పోస్ట్ చేశారు. రస్సెల్ వైపర్ పాముల్లో అత్యంత అరుదుగా ఇలాంటివి పుడుతుంటాయి.