రెండు తలల పామును.. గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లి - MicTv.in - Telugu News
mictv telugu

రెండు తలల పామును.. గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లి

October 23, 2020

ఈ సృష్టిలో వింతలకు కొరత లేదు. ఏ మూగజీవైనా కాస్త తేడాగా పుడితే చాలు కళ్లప్పగించి చూస్తుంది. బర్రెలు, గొర్రెలు, మేకలు మనిషి ముఖంతో పుడుతుటడం మనకు తెలిసిందే. మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఈ లోకంలో చాలానే పుడుతున్నాయి. రెండు తలల పాములు కూడా వాటిలో కొన్ని. అలాంటివి మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కొన్ని దారితప్పి మన దగ్గరకు వస్తుంటాయి. అయితే రెండు తలల పాముల్లో చాలా వరకు పుట్టిన వెంటనే చనిపోవడమో, లేకపోతే కొన్ని నెలలు బతికి చనిపోవడమో జరగుతుంది. కొన్ని మాత్రం కొన్నేళ్లు బతుకుతాయి. 

A rare two-headed southern black racer was recently found at a residence in Palm Harbor by Kay Rogers and family. This…

Publiée par FWC Fish and Wildlife Research Institute sur Mercredi 21 octobre 2020

అమెరికాలో తాజాగా ఓ రెండు తలలు పాము కనిపించింది. అదొక విశేషమైతే, ఓ పిల్లి దాన్ని పట్టుకొచ్చి తన యజమానికి కానుకగా ఇవ్వడం మరో విశేషం. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ మార్బర్‌లో నివసిస్తున్న కే రోజెర్స్‌ ఓ పిల్లిని పెంచుకుంటోంది. దాని పేరు ఆలివ్. ఆలివ్‌కు బయట తిరగడమంటే భలే సరదా. అది ఇటీవల బయటికి వెళ్లింది. వస్తూ వస్తూ బారెడు పొడవున్న రెండు తలల పామును తీసుకొచ్చింది. దాన్ని నేరుగా లివింగ్ రూంలోకి తీసుకొచ్చి కార్పెట్‌పైన ఉంచింది. రోజెర్స్ కూతురు మొదట ఆ పామును చూసి భయపడిపోయింది. తర్వాత వింతగా ఉందని ఎక్కడికీ పారిపోకుండా బంధించింది. దానికి డోస్ అనే పేరు కూడా పెట్టింది.

రోజెర్స్ ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్లొచ్చి  ఆ వింత పామును పెట్టుకెళ్లిపోయారు. జన్యులోపం వల్ల ఇలాంటివి పుడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. (రెండు తలల్లో రెండు మెదళ్లు ఉండడం వల్ల వాటి మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఒక మెదడు నుంచి ఒక సంకేతం, మరో మెదడు నుంచి మరో సంకేతం వస్తుంది. దీంతో అవి గందరగోళానికి గురవుతాయి… ఆహరం తీసుకోవడంలోనూ ఇబ్బందులు పడతాయి. శత్రువులకు కూడా చాలా సులభంగా దొరికిపోతాయ ’ అని వివరించారు. ప్రస్తుతం వింతపామును జూలో ఉంచి కాపాడుతున్నారు.