కర్ణాటకలో అరుదైన తెల్లకొండచిలువ.. సొగసు చూడండి(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటకలో అరుదైన తెల్లకొండచిలువ.. సొగసు చూడండి(వీడియో)

June 5, 2020

rare white albino python Karnataka Bantwal

శ్వేతనాగు పేరుతో చాలా సినిమాలే ఉన్నాయి. పాములు తెల్లగా ఉండడం అరుదు. నాగుపాముల్లోనే కాదు, మాలో కూడా తెల్లటివి ఉన్నాయంటూ ఊర్లోకొచ్చింది ఓ కొండచిలువ. సరాసరా పాకుతూ కనువిందు చేసింది. కర్ణాటకలోని బంత్వాల్‌లో మంచులా తెల్లగా మెరిసిపోతున్న పైథాన్ కనిపించింది. ఓ ఇంట్లోకి దూరి హల్‌చల్ చేసింది. జనం భయపడినా, ఎంత అందంగా ఉన్నావే నీ సిగదరగా అంటూ కళ్లప్పగించి చూస్తుండిపోయారు. తర్వాత అటవీ శాఖ అధికారులు వచ్చి తమపని తాము చేసుకుపోయారు. దాన్ని పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇలాంటి తెల్ల కొండచిలువలు చాలా అరుదు అని, కనిపిస్తే చంపేయకుండా తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మీరు కూడా దాని అందాన్ని ఈ వీడియోలో చూసేయండి మరి.