ఈ రాబందు 20 ఏళ్ల తర్వాత కనిపించింది - MicTv.in - Telugu News
mictv telugu

ఈ రాబందు 20 ఏళ్ల తర్వాత కనిపించింది

May 18, 2019

 

Rare White Backed Vulture is a critically endanger species in India and globally and has not been sighted in and around Hyderabad city in last 20 years.

రాబందుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. వీటి పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నజరానాలు కూడా ప్రకటిస్తున్నాయి. వీటిని పరిరక్షించడానికి తెలంగాణ అటవీ అధికారులు కూడా  తీవ్రంగా యత్నిస్తున్నారు. వారి ఆశలను చిగురింపజేస్తూ హైదరాబాద్‌లో అరుదైన రాబందు ప్రత్యక్షమైంది.

ఆసిఫ్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద శుక్రవరం రాబందును గుర్తించిన అబ్దుల్ నయీం, అబ్దుల్ అజీజ్ అనే స్థానికులు అరణ్య భవన్‌కు ఫోన్ చేశారు. అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకున్నారు. అది వైట్ బ్యాక్డ్ వల్చర్ జాతికి చెందినదిగా గుర్తించారు. ‘అది చిన్నపిల్ల. తిండిలేక నిస్సత్తువతో కనిపించింది. జూ పార్క్‌కు తీసుకెళ్లి ఎలక్ట్రాన్ తాగించాం. ఈ రోజు కోలుకుంది. మాంసం ముక్కలు తింటోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ జాతి రాబందు కనిపించడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇది గూటి నుంచి తప్పించుకుని వచ్చి ఉంటుంది. గూడును గుర్తించే పనిలో ఉన్నాం.. ’ అని అధికారులు చెప్పారు.