తెల్లకాకి అరెస్ట్.. అలా పుట్టడమే దాని పాపమా?  - MicTv.in - Telugu News
mictv telugu

తెల్లకాకి అరెస్ట్.. అలా పుట్టడమే దాని పాపమా? 

August 13, 2020

Rare white crow spotted in odisha jharsuguda .

తులసి వనంలో గంజాయి మొక్క, కందిగింజల్లో పెసరగింజ.. వగైరా సామెతలు మీకు తెలుసు కదా. వాటి సంగతి వదిలేస్తే పశుపక్ష్యాదుల్లో కొన్ని తమ జాతిలోని వాటికి భిన్నంగా పుడుతుంటారు. ఆ మాటకొస్తే మనుషుల్లో మాత్రం పుట్టడం లేదా ఏంటి? కాకులు నల్లగా ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. కొన్ని చోట్లు తెల్ల కాకులు ఊంటాయి. జన్యువుల్లో తేడా వల్ల అలా పుడతుంటాయి. ఇటీవల ఢిల్లీలో నల్ల కాకాల గుంపులో ఓ తెల్లది కాకా అని మొత్తుకుంటూ తెగ అల్లరి చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే ఆక్కడోళ్లు దాన్ని కేవలం వీడియో తీసి దాని మానాన దాన్ని వదిలేశార. 

తాజాగా ఒడిశాలోని జార్సుగూడ పట్టణంలో మాత్రం ఓ తెల్ల వాయసానికి జనం చుక్కలు చూపించారు. దీప్తివో సోని అనే వ్యక్తి ఇంటి వద్ద అది కనిపించింది. తర్వాత దాన్ని కొందరు ‘అరెస్ట్’ చేసి బోనులో పెట్టారు. తెల్లకాకి దొరికిందని చుట్టుపక్కల ప్రచారం కావడంతో జనం దాన్ని చూడ్డానికి ఎగబడ్డారు. విషయం కాస్తా అధికారులకు తెలిసింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ‘జైల్లో’ ఉన్న కాకిని చూసి ముక్కున వేలేసుకున్నారు. అసలు దాన్ని ఎందుకు పట్టుకున్నారంటూ నిందితులను తిట్టారు. తెల్లకాకులను పట్టుకోవడం కూడా నేరమేనంటూ దాన్ని తిరిగి గాల్లోకి వదిలేశారు. కాకిని నిర్బంధించడంపై జంతుహక్కుల సంఘాలు మండిపడుతున్నారు. తెల్లగా పుట్టడమే నేరమా అని ప్రశ్నిస్తున్నాయి.