ఆస్ట్రేలియాకు చుక్కలు చూపెట్టిన రషీద్ ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియాకు చుక్కలు చూపెట్టిన రషీద్ ఖాన్

November 4, 2022

టీ20 వరల్డ్ కప్ సూపర్ -12 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతే గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో ఆఫ్గాన్ 164 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఆసీస్‌కు అఫ్ఘాన్ ఆటగాడు రషీద్ ఖాన్(23 బంతుల్లో 48 పరుగులు) చివర్లో చుక్కలు చూపెట్టాడు.18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన సమయంలో రషీద్ బౌండరీలతో విరుచుకుపడి కంగారుల గుండెల్లో గుబులు పుట్టించాడు.

18 ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన రషీద్ , 29 ఓవర్లలో పది పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి ఓవర్‌‌లో ఆఫ్గాన్‌కు 22 పరుగుల అవసరమయ్యాయి. 20 ఓవర్ స్టోయినిస్ వేసిన వైడ్ బంతికి రసూలీ(15) రనౌట య్యాడు. మరుసటి బంతి డాట్ అవ్వగా.. రెండో బంతిని రషీద్ బౌండరీకి తరలించాడు. మూడో బంతి డాట్ అవ్వగా..నాలుగో బంతిని సిక్సర్‌గా కొట్టి ఐదో బంతికి డబుల్ తీసాడు. చివరి బంతికి రషీద్ ఫోర్ కొట్టినా ఫలితం లేకపోయింది. దీంతో విజయం ఆఫ్గాన్ గుమ్మం వరకు వచ్చి నిలిచిపోయింది. ఏదేమైన రషీద్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టించాడు.