తప్పులో కాలేసిన గూగుల్.. రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మనా! - MicTv.in - Telugu News
mictv telugu

తప్పులో కాలేసిన గూగుల్.. రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మనా!

October 12, 2020

Rashid Khan Wife in Google Search.

అప్పుడప్పుడు గూగుల్‌ సెర్చ్‌లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకరి సమాచారానికి బదులు మరొకరి వివరాలు వస్తూ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు కొత్త చిక్కులను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇలాంటి తప్పిదమే మరొకటి వెలుగులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్, క్రికెట్ అభిమానులు షాక్‌లో మునిగిపోయారు. నటి అనుష్క శర్మ  అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్య అని చూపిస్తోంది. ఎవరు సెర్చ్ చేసినా అనుష్క శర్మ పేరు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నిజానికి రషీద్ ఖాన్‌‌కు అసలు పెళ్లే కాలేదు. కానీ విరాట్ కొహ్లీ భార్య అనుష్క శర్మ పేరు సెర్చ్ చేసిన వెంటనే వస్తోంది. అయితే దీనికి కారణాలు కూడా పలువురు నిపుణులు వెల్లడిస్తున్నారు. 

2018లో ఇన్‌‌స్టాగ్రామ్‌‌ చాట్‌లో అతడి అభిమానులు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడగడంతో అనుష్క శర్మ, ప్రీతి జింటా అని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఆ యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. దీంతో వీరిద్దరి పేరు పాపులర్ కావడంతో గూగుల్ సెర్చ్ రషీద్ ఖాన్ భార్య అని టైప్ చేయగానే ఇలా చూపిస్తోంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్  స్పిన్నర్ రషీద్ ఖాన్ తాను తమ దేశానికి వరల్డ్ కప్ వచ్చే వరకు పెళ్లి ఆలోచన చేయదలుచుకోలేదని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.