rashmi-gautam-strong-reply-netizen-who-called-her-dog-over-amberpet-incident
mictv telugu

అడ్రస్ ఇయ్యి, నేనే వస్తా- యాంకర్ రష్మీ

February 25, 2023

 rashmi-gautam-strong-reply-netizen-who-called-her-dog-over-amberpet-incident

పాపులర్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించకున్న రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీద స్పందిస్తూ తనదైన స్టైల్ లో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో చిన్నారి మీద కుక్కల దాడి ఘటన మీద కూడా రష్మీ స్పందించింది. కుక్కలకు కూడా ఒక షెల్టర్ ఉంటే బావుంటుంది. ఇలాంటి సంఘటనలు కూడా జరగవు అంటూ ట్వీట్ చేసింది.

రష్మీ జంతుప్రేమికురాలు. కరోనా టైమ్ లో రోడ్డు మీద ఉండే జంతువులకు ఫుడ్ పెడుతూ చాలా వీడియోలు పోస్ట్ చేసింది. సమయం దొరికినప్పుడల్లా జంతువుల గురించి పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. వాటికి సేవా కార్యక్రమాలు చేస్తూ తన ప్రేమను చాటుకుంటుంది కూడా. ఇప్పుడు కూడా కుక్కల దాడి ఘటనలో తన జంతుప్రేమను చాటుకునే ప్రయత్నం చేసింది. అయితే రష్మీ పెట్టిన ట్వీట్ మీద నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొంత మంది రష్మీ ట్వీట్ కు మద్దతు ఇస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే హద్దులు దాటి మరీ కామెంట్ చేశాడు. ఈ కుక్క రష్మీని కూడా కుక్కుని కొట్టినట్టు కొట్టాలి అంటూ చెత్తగా వాగాడు. అయితే దీనికి రష్మీ కూడా స్ట్రాంగ్ కౌటంర్ ఇచ్చింది. తప్పకుండా, నీ అడ్రస్ ఏంటో చెప్పు, నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో చూస్తా, నీకు ఇదే నా ఛాలెంజ్ అంటూ సవాలు విసిరింది. ఈ ట్వీట్ ఇప్పడు చాలా వైరల్ అవుతోంది.